CM KCR Review: గంజాయి లేని రాష్ట్రంగా తెలంగాణ, డ్రగ్స్ వినియోగం, గంజాయి అక్రమసాగుపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గంజాయి వినియోగంపై తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం వచ్చిందన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని ఆదేశించారు.

Telangana CM KCR | File Photo

Hyd, Oct 20: తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై (illegal drug supply in Telangana) ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కేసీఆర్‌ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగంపై తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం వచ్చిందన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని ఆదేశించారు. తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు.

ఉన్నతస్థాయి సమావేశంలో (CM KCR Review) విస్తృతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నారని సీఎం చెప్పారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుందని... ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని చెప్పారు.

చేవెళ్ల నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం, 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు, 16 సెగ్మెంట్లను చుట్టేలా పాదయాత్ర, తరలి రానున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు

అమాయకులైన యువకులు గంజాయి బారిన పడుతున్నారని, నేరస్థులు ఎంతవారైనా ఉపేక్షించొద్దని కేసీఆర్ ఆదేశించారు. గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి అధికారిని నియమించి.. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని చెప్పారు. విద్యాసంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. తెలంగాణ పోలీస్‌కు బెస్ట్ పోలీస్ అని పేరుందని, దాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ సూచించారు.



సంబంధిత వార్తలు

AR Rahman Team Issued Legal Notice: ఏఆర్ రెహ‌మాన్ విడాకుల‌పై క‌థ‌నాలు ప్ర‌చురించిన‌వారిపై ప‌రువున‌ష్టం దావా, 24 గంటల్లోగా క‌థ‌నాలు డిలీట్ చేయాల‌ని అల్టిమేటం

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి