CM Jagan Review on PRC: నన్ము నమ్మండి, మీకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని తెలిపిన ఏపీ సీఎం, పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపిన ముఖ్యమంత్రి జగన్

ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని, పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం (Andhra pradesh, CM YS Jagan) అన్నారు.

CM Jagan Review on PRC: నన్ము నమ్మండి, మీకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని తెలిపిన ఏపీ సీఎం, పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపిన ముఖ్యమంత్రి జగన్
CM YS Jagan reviews on Clean AP program (Photo-Twitter/AP CMO)

Amaravati, Jan 7: ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని, పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం (Andhra pradesh, CM YS Jagan) అన్నారు. అన్నింటినీ స్ట్రీమ్‌ లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. దయచేసి అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు.

పీఆర్సీపై చర్చించేందుకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో (CM Jagan Review on PRC) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాలుగా మేలు చేసే ప్రయత్నాలు చేస్తామని, రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన (may announce PRC in two or three days) చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉద్యోగులకు మంచి చేస్తూ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వేతనాల పెరుగుదల, ఆదాయం తగ్గుతున్న తీరును ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వివరించారు.

ఎవరికైనా మంచే చేయాలని తాపత్రయ పడతాను. వీలైనంత ఎక్కువ మందికి మంచి చేయాలని ఆరాటపడతాను. ఆ మంచిలో ఏ ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కాకుండా మిగిలి పోకూడదనేది నానైజం అని సీఎం తెలిపారు. కొన్ని వాస్తవాలను, కొన్ని అంశాలను బేరీజు వేసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రభావం తర్వాత సంవత్సరాలన్నింటిపైనా ఉంటుంది. మనం అధికారంలోకి వచ్చాక అనుకోని పరిస్థితులు వచ్చాయి. ఒకవైపు పీఆర్సీ గురించి మాట్లాడుతున్నాం.. మరో వైపు ఒమిక్రాన్‌ విస్తరిస్తోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలియదు? దాని ప్రభావం దేశ ఆదాయాల మీద, రాష్ట్ర ఆదాయాల మీద ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు? అలాంటి పరిస్థితుల మధ్య పీఆర్సీపై మాట్లాడుతున్నామని అన్నారు.

నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ.. రెండు ఆదాయాలు తగ్గిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం నిర్ణయం తీసుకోవడానికి కూర్చున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసరే... ఆ నిర్ణయంతో మనం కలిసి ముందుకు సాగాలి. మనం చేయదగ్గ పరిస్థితి ఉందా? అన్న ఆలోచన చేయాలని సీఎం తెలిపారు. ఒక్కసారి స్టేట్‌ ఓన్‌ రెవెన్యూస్‌ (ఎస్‌ఓఆర్స్‌) గమనిస్తే.. 2018–19లో ఎస్‌ఓఆర్‌ రూ.62,503 కోట్లు అయితే 2019–20లో అది రూ.60,934 కోట్లకు, 2020–21లో రూ.60,688 కోట్లకు తగ్గింది. మామూలుగా ప్రతి ఏటా 15 శాతం పెరగాలి. ఈ లెక్కన 2018–19లో ఉన్న రూ.62 వేల కోట్లు 2019–20లో రూ.72 వేల కోట్లు కావాలి. 2020–21లో రూ.72 వేల కోట్లు రూ.84 వేల కోట్లు కావాలి. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని ఆవేద వ్యక్తం చేశారు.

2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి అది రూ.67,340 కోట్లకు చేరుకుంది. ఉద్యోగులకు అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పెరుగుదల వచ్చింది. మనం అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం. దాదాపు రూ.18 వేల కోట్ల వరకు చెల్లించాం. 2019 జూలై 1 నుంచి ఈ రోజు వరకు ఐఆర్‌ ప్రభావం ఇది. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ తదితర విభాగాలకు చెందిన 3,01,021 ఉద్యోగులకు జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది.

ఈ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను అందించింది. ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింప చేసింది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా వీరికి కూడా అమలు చేస్తోంది. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.360 కోట్ల మేర భారం పడుతోంది. ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశాం. దీని వల్ల 2020 జనవరి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. జనవరి 2020 నుంచి అక్టోబర్‌ 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకు వచ్చాం. 1.28 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఏడాదికి రూ.2,300 కోట్ల భారం పడిందని సీఎం అన్నారు.

మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. ఈ రోజు మనం ఐఆర్‌తో పాటు ఏ జీతాలు ఇస్తున్నామో.. అవి ఇస్తూ.. కమిటీ చెప్పినట్టుగా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం. ఫిట్‌మెంట్‌ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్‌ కావాలి. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్‌ లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి..ఉద్యోగ సంఘాలకు వివరించిన అధికారులు

► రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. జనాభా 58.32 శాతం వస్తే, రెవిన్యూ 46 శాతం మాత్రమే వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అతితక్కువగా తలసరి ఆదాయం రూ.1,70,215 మాత్రమే ఉంది.

► షెడ్యూలు 9లో పేర్కొన్న సంస్థల కారణంగా రూ.1.06 లక్షల కోట్ల ఆస్తులను వదిలి వచ్చాం. షెడ్యూలు 10లో ఉన్న సంస్థలను వదులు కోవడం ద్వారా రూ.39,191 కోట్ల విలువైన ఆస్తులను కోల్పోయాం. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం.

►విన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి రూ.18,969 కోట్ల బకాయి ఉంది. కోవిడ్‌ కారణంగా మరింత ఆదాయాన్ని కోల్పోయాం. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా గణనీయంగా తగ్గింది.

►చీఫ్‌ సెక్రటరీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,137 కోట్లు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. తెలంగాణాలో, ఛత్తీస్‌గఢ్‌లో, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, హరియాణ రాష్ట్రాల కంటే అధికం.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Opposition Status Row in AP: అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)

Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Uttar Pradesh: ఇంత దారుణమా, నడిరోడ్డు మీద వృద్ధ దంపతులను ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ కొట్టిన ఓ వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు

Share Us