Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, ఉదయాన్నే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిక

అన్ని జిల్లాలను చలి పులి వణికిస్తోంది. ఏపీలో అరకులోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Cold Wave (photo-ANI)

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలను చలి పులి వణికిస్తోంది. ఏపీలో అరకులోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో 6 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 6.2 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లాలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.

తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌

ఇక, హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉప్పల్‌లో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. శేరిలింగంపల్లి, రామచంద్రాపురంలో సైతం చలి తీవ్రత పెరిగింది. శీతల గాలులు, చలి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి కారణంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.