Coronavirus in AP: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కరోనా కేసులు, తాజాగా 6,952 మందికి కోవిడ్ పాజిటివ్‌, 58 మంది మృత్యువాత, 11,577 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌, ప్రస్తుతం 91,417 యాక్టివ్‌ కేసులు

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,952 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus in AP) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 58 మంది మృత్యువాతపడ్డారు.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

Amaravati, June 12: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,952 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus in AP) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 58 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,882కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 11,577 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 96 వేల 880 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 91,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,03,48,106 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. 45 ఏళ్లు పైబడినవారిలో ఇప్పటికే 53.7 శాతం మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేశామన్నారు.

మూడు రాజధానులు ఏర్పడటం ఖాయం, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా కేంద్రం సహకారం తప్పక ఉంటుంది, సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షానికి అంత కడుపు మంట ఎందుకు? మీడియాతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,13,76,000 డోసులు పంపిణీ చేశామని చెప్పారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామని వివరించారు. 45 ఏళ్లు పైబడినవారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. జూన్‌ నెలాఖరుకు 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు.

Here's Report

సింఘాల్‌ ఇంకా ఏం చెప్పారంటే..రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు జూన్‌ 10న 8. 29, జూన్‌ 11న 8.09గా నమోదైంది. రికవరీ రేటు 94 శాతంగా ఉంది. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జూన్‌ 10న 67 మంది, 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 96,100 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో 15,951 మంది, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్‌లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్‌ ఫంగస్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీనితో 138 మంది మృతి చెందారు. ఈ కేసులను దాచిపెడుతున్నామనే ఆరోపణలు సరికాదు. కేసులు దాచిపెట్టడం వల్ల కేంద్రం నుంచి బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్‌–బి ఇంజక్షన్లు రాకుండా పోతాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement