AP Covid Update: కొత్తగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా, ఏపీలో 24 గంటల్లో 10,794 మందికి కోవిడ్-19, 4,98,125కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 4417 కు చేరిన మృతుల సంఖ్య
దీంతో మొత్తం కేసుల 4,98,125 కు సంఖ్య చేరింది. తాజా పరీక్షల్లో 35,358 ట్రూనాట్ పద్ధతిలో, 37,215 ర్యాపింగ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. వైరస్ బాధితుల్లో కొత్తగా 70 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 4417 కు చేరింది. చిత్తూరు 9, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.
Amaravati, Sep 6: ఏపీలో గడిచిన 24 గంటల్లో 72,573 నమూనాలు పరీక్షించగా 10,794 పాజిటివ్ కేసులు (Andhra Pradesh COVID-19 cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల 4,98,125 కు సంఖ్య చేరింది. తాజా పరీక్షల్లో 35,358 ట్రూనాట్ పద్ధతిలో, 37,215 ర్యాపింగ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. వైరస్ బాధితుల్లో కొత్తగా 70 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 4417 కు చేరింది.
చిత్తూరు 9, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.
గత 24 గంటల్లో 11,915 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,94,019 కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 99,689 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 41,07,890 కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.
నెల్లూరు జిల్లాలో కరోనా పెరిగిపోతున్న నేపధ్యంలో నగరం, గూడూరు, నాయుడుపేటతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు జనతా కర్ఫ్యూ విధించారు. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. పూర్తిగా లాక్ డౌన్ ఉంటుందని అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కరోనా పాజిటివ్
అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కరోనా పాజిటివ్ (Madakasira MLA Dr M. Thippeswamy) రావడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్యం పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి డాక్టర్లతో కూడా ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ స్వామిదినేష్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు కరోనా పాజిటివ్
నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు (Nuzvid MLA Meka Venkata Pratap Apparao) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు నెలలుగా ప్రజాహిత కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న ఎమ్మెల్యే ప్రతాప్ రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎమ్మెల్యే ప్రతాప్ చెప్పారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా అత్యవసరమైతే ఫోన్‌లో తనను సంప్రదించవచ్చన్నారు. ఎవరికైనా పనులుంటే పట్టణంలోని తన కార్యాలయానికి వెళ్లి కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారన్నారు.
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు (pithapuram MLA Pendem Dorababu) కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. శనివారం ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తనకు పాజిటివ్ వచ్చిందని, ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. దొరబాబుకు కొవిడ్ రావడంతో సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.