108 Ambulance Ablaze in Ongole: రోగుల్ని కాపాడే 108కే నిప్పంటించారు, ఒంగోలు పోలీస్టేషన్ పరిధిలో ఓ రౌడీ వీరంగం, అర్ధరాత్రి పోలీసులకు చుక్కలు చూపించిన రౌడీ షీటర్
ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో నేలపాటి సురేష్ అనే రౌడీ షీటర్ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ కేసు విచారణలో భాగంగా అతన్ని స్టేషన్‌కు (police station) తరలించగా అక్కడున్న పోలీసులకు చుక్కలు చూపించాడు. స్టేషన్‌లో అర్ధరాత్రి డోర్ అద్దాలు పగలగొట్టి చేతులు గాయపరుచుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులు 108 వాహనం ఎక్కించి రిమ్స్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ ఎక్కిన నిందితుడు అక్కడ ఉన్న కాటన్‌కు (108 Ambulance Ablaze in Ongole) నిప్పంటించాడు. అందరూ చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి.
Amaravati, Sep 16: ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్ లోనే ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో నేలపాటి సురేష్ అనే రౌడీ షీటర్ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ కేసు విచారణలో భాగంగా అతన్ని స్టేషన్‌కు (police station) తరలించగా అక్కడున్న పోలీసులకు చుక్కలు చూపించాడు. స్టేషన్‌లో అర్ధరాత్రి డోర్ అద్దాలు పగలగొట్టి చేతులు గాయపరుచుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులు 108 వాహనం ఎక్కించి రిమ్స్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ ఎక్కిన నిందితుడు అక్కడ ఉన్న కాటన్‌కు (108 Ambulance Ablaze in Ongole) నిప్పంటించాడు. అందరూ చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి.
అయినప్పటికీ నిందితుడు సురేష్ వింతగా నవ్వుతూ వాహనం నుంచి దిగడానికి మొండికేశాడు. సచ్చిపోతానంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని బలవంతంగా కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. అయితే, వారి కళ్లుగప్పి సురేష్ పరారయ్యాడు.
Here's 108 Ambulance Ablaze in Ongole Video
గత నాలుగు రోజులుగా నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేక స్టేషన్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. అతన్ని కోవిడ్ అనుమాతుడిగా భావిస్తున్నామని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా, మంటల ధాటికి అంబులెన్స్ పూర్తిగా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పాయి.