AP Coronavirus Update: ఏపీలో ఎక్కువ టెస్టుల ఫలితం, ఇప్పుడు యాక్టివ్ కేసులు 38, 979 మాత్రమే, రోజు రోజుకు పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 3,967మందికి కరోనా
3,967మందికి కరోనా (AP Coronavirus ) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,75,470కి (Coronavirus in AP) చేరుకుంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 5,010 మంది కరోనా వైరస్ (Covid 19) బారి నుంచి కోలుకోగా.. మొత్తం సంఖ్య 7,30,109 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38, 979 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Amaravati, Oct 17: రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 74,337 సాంపిల్స్ పరీక్షించగా.. 3,967మందికి కరోనా (AP Coronavirus ) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,75,470కి (Coronavirus in AP) చేరుకుంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 5,010 మంది కరోనా వైరస్ (Covid 19) బారి నుంచి కోలుకోగా.. మొత్తం సంఖ్య 7,30,109 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38, 979 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
వైరస్ బాధితుల్లో కొత్తగా మంది 25 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6382 కు (Covid Deaths) చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 69,20,377 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. కడప, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లా్ల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు
ఇదిలా ఉంటే కరోనా వైరస్ భవిష్యత్తులో ఎండెమిక్ గా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంటే టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ వ్యాధి మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఓ అంచనాకొచ్చారు. తట్టు వంటి వాటికి టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ దానిని పూర్తిగా నిర్మూలించలేకపోయినట్టు చెబుతున్నారు. ఏదైనా ఒక ప్రదేశానికి పరిమితమై మళ్లీ మళ్లీ సంక్రమించే ‘ఎండెమిక్’ లక్షణంగా కరోనా వైరస్ మారే అవకాశం ఉందని కొలంబియా మెయిల్‌మాన్ స్కూల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇలా మారడానికి పలు కారణాలు దోహదం చేస్తాయన్నారు. రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ లభ్యత, దాని సమర్థత, సీజనాలిటీ వంటివి ఇందుకు కారణం అవుతాయన్నారు.
నిజానికి వైరస్ సోకి కోలుకున్న తర్వాత లభించే రోగనిరోధకశక్తి కానీ, వ్యాక్సిన్ ద్వారా లభించేది కానీ ఏడాదిలోపే తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి ఆ తర్వాత కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందన్నారు. అదే సమయంలో ఇతర స్థానిక కరోనా వైరస్ (ఎండెమిక్) సంక్రమణ ద్వారా లభించే రోగ నిరోధక శక్తి చాలా కాలం ఉండే అవకాశం ఉందని, అది సాధ్యమైతే కొన్ని సంవత్సరాలపాటు వైరస్ వ్యాప్తి పునరావృతమైన తర్వాత దానిని పూర్తిగా నిర్మూలించే వీలుంటుందని వివరించారు. అయితే, ఇందుకు కూడా వ్యాక్సిన్ లభ్యత, దాని ప్రభావం వంటివి దోహదం చేస్తాయని అన్నారు. అయితే, ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు వివరించారు.