AP Coronavirus: కొత్త న్యూస్.. కళ్లద్దాలపై కరోనా, కరోనా బారీన పడి చనిపోయిన వాళ్లలో మగవాళ్లే ఎక్కువ, ఏపీలో తాజాగా 10,392 మందికి కరోనా

ఇప్పటివరకూ 38,43,550 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 60,804 పరీక్షలు చేయగా, 10,392 మందికి పాజిటివ్‌గా (Coronavirus) నిర్ధారణ అయ్యింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 4,55,531కి కరోనా కేసులు (positive cases) చేరాయి. గత 24 గంటల్లో 72 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,125 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Coronavirus outbreak in India (Photo Credits: IANS)

Amaravati, Sep 2: ఏపీలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు 38 లక్షలు దాటాయి. ఇప్పటివరకూ 38,43,550 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 60,804 పరీక్షలు చేయగా, 10,392 మందికి పాజిటివ్‌గా (Coronavirus) నిర్ధారణ అయ్యింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 4,55,531కి కరోనా కేసులు (positive cases) చేరాయి. గత 24 గంటల్లో 72 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,125 కి చేరింది.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళవారం కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు 3,48,330 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,076 యాక్టివ్‌ కేసులు (Andhra Pradesh COVID-19 Active cases) ఉన్నాయి.

కోవిడ్‌ వల్ల నిన్న నెల్లూరులో పదకొండు మంది, చిత్తూరులో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది, ప్రకాశంలో ఎనిమిది, కృష్ణాలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్‌లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూలులో ఒక్కరు మరణించారు.

AP Corona Report

కళ్ళ అద్దాల పై కరోనా వైరస్‌ 9 రోజుల వరకు ఉంటుం‌దని, బయ‌టకు వెళ్లి వచ్చి‌న‌ప్పుడు వాటిని కచ్చి‌తంగా శుభ్రం చేయా‌లని వైద్య నిపు‌ణులు చెబుతున్నారు. మా‌స్కు‌లతో నోరు, ముక్కును కవర్‌ చేసు‌కున్న‌ట్లుగానే కళ్లను కవర్‌ చేయ‌డా‌నికి అద్దాలు అంతే అవ‌సరం. అయితే కళ్ల అద్దాలతో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని డాక్టర్లు తెలుపుతున్నారు. ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా, గోవా ముఖ్యమంత్రికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 78,357 మందికి కరోనా, 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్

ఇక దేశంలో కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం మగవాళ్లే ఉన్నారు. మహమ్మారి దెబ్బతో చనిపోయిన వారిలో మహిళల సంఖ్య కంటే పురుషులు రెట్టింపుగా ఉన్నారు. వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచిన వారిలో 69 శాతం మంది పురుషులేనని హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం తెలుస్తోంది. కరోనాతో చనిపోయిన వారిలో మహిళలు, పురుషులను కలుపుకొని చూసుకుంటే మృతుల్లో 90 శాతం మంది 40 ఏళ్ల లోపు పైబడిన వారు ఉండటం గమనార్హం. కరోనాతో వైద్య సిబ్బంది మరణిస్తే రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు, ఇప్పటికే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

ఆగస్టు 22 నాటికి 56,292 మంది మృతుల్లో 50-70 ఏళ్ల వయస్కులే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలోనూ పురుషులు 38,973 మంది ఉండగా, మహిళలు 17,315 మంది ఉన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన వారిలో 10 ఏళ్ల లోపు వారిలో 301 మంది పిలల్లు ఉన్నారు