Hyderabad, Sep 2: కరోనాతో మరణించిన వైద్యసిబ్బంది కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా (₹25 lakh ex-gratia) రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) వెల్లడించారు. మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో డాక్టర్ల సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.డాక్టర్ సంఘాల డిమాండ్లని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు డాక్టర్ల సంఘాలకు తెలిపారు. కరోనా బారిన పడిన డాక్టర్ లకు నిమ్స్ లో వైద్యసేవలు అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
అంతేకాకుండా కరోనా బారినపడ్డ డాక్టర్లు,వైద్యసిబ్బంది కి చికిత్స సమయంలో ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని ఈటెల పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనాతో మరణించిన వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు పునరుద్ధరణ
తాజాగా కరోనా వలన మరణించిన డాక్టర్, వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అందించే 50 లక్షలతో పాటుగా, 25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణలో కొత్తగా మరో 2,892 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్ష 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 846కు పెరిగిన కరోనా మరణాలు
అయితే డాక్టర్స్ సంఘాలు మాత్రం డాక్టర్స్ కి సీఎం సహయనిధి నుండి మరికొంత సాయం అందించాలని మంత్రిని కోరారు.కరోనాపై పోరాటంలో ముందుండి సేవలందిస్తున్న డాక్టర్స్, పారామెడికల్, ఇతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి సంబంధించిన ఇతర సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.