Coronavirus 'Positive' News: కరోనావైరస్.. విద్యార్థులందరూ పాస్! పరీక్షలు రాయకుండానే 6 నుంచి 9 తరగతుల వారిని పాస్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఇప్పుడు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ పైతరగతులకు వెళ్లేలా ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) అవకాశం కల్పిస్తుంది. ఈసారి ఆయా తరగతులకు సంబంధించిన వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ......
Amaravathi, March 27: కరోనావైరస్ యావత్ (COVID 19 outbreak ప్రపంచాన్ని గజగజలాడిస్తుంది. కరోనావైరస్ భారతదేశంలో 'లాక్ డౌన్' (Lockdown) విధించే పరిస్థితి తీసుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని 'మహమ్మారి' గా ప్రకటిస్తూ ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చింది. కరోనావైరస్ అందరినీ భయపెడుతుంది, బాధపెడుతుంది. కానీ విద్యార్థుల పాలిట ఈ వైరస్సే వరమైంది. తరగతులు ఆగిపోవాలి, స్కూళ్లు, కాలేజీలు మూతపడాలి, ఈ పరీక్షలు రద్దు కావాలి అని సగటు పాఠశాల విద్యార్థి కల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి కల నేడు నిజమైంది.
ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ఇచ్చేశారు. ఇప్పుడు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ పైతరగతులకు వెళ్లేలా ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) అవకాశం కల్పిస్తుంది. ఈసారి ఆయా తరగతులకు సంబంధించిన వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ, విద్యార్థులందరూ పాస్ అయినట్లుగా 'మెమో నెంబర్ 92' తో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో విద్యార్థుల ఇళ్లకే నేరుగా మధ్యాహ్న భోజనం - 'జగనన్న గోరు ముద్ద' పథకం కింద ఆహార పదార్థాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామవాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీ- టీఎస్ సరిహద్దు వద్ద ప్రజల పడిగాపులు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి
ఇక ఎటొచ్చి పదో తరగతి పరీక్షల విషయంలో సందిగ్ధత నెలకొంది. మార్చి 31న ఇదే అంశంపై ప్రభుత్వం సమీక్షించి కొత్త షెడ్యూల్ విడుదల చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం సూచించింది.
ఏదైమైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురికాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ఒక పాజిటివ్ అంశమే. అయితే ఈ సెలవులలో ఎవరూ కూడా ఎవరితో కలవకుండా ఎవరింట్లో వారుంటూ ప్రభుత్వానికి సహకరిస్తే రాష్ట్రాన్ని సురక్షితంగా, సుభిక్షంగా ఉంచినవారవుతారు. వీలైనంత త్వరగా మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేయచ్చు