Covid in Andhra Pradesh: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, తాజాగా 15,284 మందికి కోవిడ్ పాజిటివ్, 106 మంది మృతి, జిల్లాల వారీగా కేసులు, మరణాల సంఖ్యలు ఇవే..

గడిచిన 24 గంటల్లో 72,979 నమూనాలను పరీక్షించగా.. 15,284 మందికి పాజిటివ్‌గా (Covid in Andhra Pradesh) తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి (Coronavirus Positive Cases) చేరింది.

Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, May 25: ఏపీలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం కలవరుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,979 నమూనాలను పరీక్షించగా.. 15,284 మందికి పాజిటివ్‌గా (Covid in Andhra Pradesh) తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి (Coronavirus Positive Cases) చేరింది.

కొత్తగా మరో 106 మంది కరోనాకు బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 10,328కి (Covid Deaths) పెరిగింది. తాజాగా 20,917 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు 1,87,49,201 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.

కరోనా మహమ్మారి వల్ల చిత్తూరులో అత్యధికంగా 15 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి,నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Covid in AP

గత 24 గంటల్లో అనంతపురంలో 1034 కేసులు, చిత్తూరులో 1970, ఈస్ట్ గోదావరిలో 2663, గుంటూరులో 802, కడపలో 436, కృష్ణాలో 568, కర్నూలులో 1387, నెల్లూరులో 648, ప్రకాశంలో 978, శ్రీకాకుళంలొ 991, విశాఖపట్నంలో 1840, విజయనగరంలో 555, వెస్ట్ గోదావరిలో 1412 కేసులు నమోదయ్యాయి.