CPM Workers Protest: రోడ్డుపై ఈత కొట్టిన సీపీఎం నేతలు, అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై వినూత్న రీతిలో నిరసన, విజయనగరం కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో నిరసన ఘటన

బురదమయమైన రోడ్లపై ( Potholes in Vizianagaram) అరటి మొక్కలు నాటారు. నీళ్లు తోడారు. చేపలు పట్టారు. ఈత (CPM Workers Swim) కొట్టారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషాను కలిపే ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు వాపోయారు.

Vizianagaram, September 8: విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలోని అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు వినూత్న రీతిలో నిరసన (CPM Workers Protest) తెలిపారు . బురదమయమైన రోడ్లపై ( Potholes in Vizianagaram) అరటి మొక్కలు నాటారు. నీళ్లు తోడారు. చేపలు పట్టారు. ఈత (CPM Workers Swim) కొట్టారు.

ఆంధ్రప్రదేశ్, ఒడిషాను కలిపే ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు వాపోయారు. అధికారులకు, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేశారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు.

తమ సమస్యలు పరిష్కరించాలని విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సచివాలయాల నుంచి విధులు నిర్వహించాలనే నిర్ణయాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాజకీయ కారణాలతో తొలగింపులు ఆపాలని, కరోనా పరిహారం, బకాయిలు వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif