Criminal Case Against Pawan Kalyan: జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు.. గుంటూరు కోర్టులో నమోదు.. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ ఏ కారణంతో జనసేనానిపై కేసు నమోదయ్యిందంటే??

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించింది.

Pawan Kalyan (Photo-Twitter)

Vijayawada, Feb 18: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పై క్రిమినల్‌ కేసు (Criminal Case) నమోదయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించింది. 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌ పై క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ కోర్టు పవన్‌ కల్యాణ్‌ కు నోటీసులు జారీ చేసింది. గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్‌ లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపైనా బురదజల్లేలా ఉన్నాయని జగన్ సర్కారు అభ్యంతరం తెలిపింది.

ISRO launches INSAT-3DS: ఇస్రో సిగ‌లో మ‌రో ఘ‌న‌త‌, నింగిలోకి దూసుకెళ్లిన ఇన్సాట్ 3డీఎస్ ఉప‌గ్ర‌హం, భూమి, స‌ముద్ర ఉప‌రిత‌లాన్ని ప‌రిశీలించ‌నున్న శాటిలైట్

పవన్ ఏమన్నారంటే?

గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్ర జరిగింది. ఈ యాత్రలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని, ఒంటరి మహిళలను కనిపెట్టి కొందరు సంఘ విద్రోహశక్తుల ద్వారా వల పన్ని కిడ్నాప్ చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్‌ పేర్కొన్నారు. ఇక కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని ఆరోపించారు. అదృశ్యమైన వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని, డీజీపీ కనీసం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ అంశంపైనే ప్రభుత్వం కోర్టులో ఫిర్యాదు చేసింది.

TTD Darshan Tickets Shedule: శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్! మే నెల అర్జిత సేవా, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, గ‌దుల బుకింగ్ టికెట్ల విడుద‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది