ISRO launches INSAT-3DS: ఇస్రో సిగ‌లో మ‌రో ఘ‌న‌త‌, నింగిలోకి దూసుకెళ్లిన ఇన్సాట్ 3డీఎస్ ఉప‌గ్ర‌హం, భూమి, స‌ముద్ర ఉప‌రిత‌లాన్ని ప‌రిశీలించ‌నున్న శాటిలైట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో రాకెట్‌ను ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (Sriharikota) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 వాహక నౌక .. ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని (ISRO launches INSAT-3DS) నింగిలోకి మోసుకెళ్లింది.

ISRO launches INSAT-3DS: ఇస్రో సిగ‌లో మ‌రో ఘ‌న‌త‌, నింగిలోకి దూసుకెళ్లిన ఇన్సాట్ 3డీఎస్ ఉప‌గ్ర‌హం, భూమి, స‌ముద్ర ఉప‌రిత‌లాన్ని ప‌రిశీలించ‌నున్న శాటిలైట్
INSAT-3DS Satellite Launch

Sriharikota, FEB 17: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో రాకెట్‌ను ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (Sriharikota) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 వాహక నౌక .. ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని (ISRO launches INSAT-3DS) నింగిలోకి మోసుకెళ్లింది. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షించి.. శాస్త్రవేత్తలకు సూచనలు చేశారు. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక (GSLV-F14) 2,275 కిలోల బరువు గల ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో తీసుకెళ్లింది.

 

ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్‌-3డీ, ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలతో కలిసి పనిచేయనుంది.

(The above story first appeared on LatestLY on Feb 17, 2024 06:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).