Cyclone Mandous: తిరుపతి నగరాన్ని అస్తవ్యస్తం చేసిన మాండూస్ తుఫాను, భారీ వర్షాల దెబ్బకు అల్లాడిపోయిన బాలాజీ జిల్లా, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి.

Cyclone Manodus Effect (Photo-Twitter)

Tirupati, Dec 10: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రామానుజం సర్కిల్, జైభీం నగర్ కాలనీ, లక్ష్మీపురం సర్కిల్ సహా 12వ డివిజన్ పరిధిలో వరద నీటిలో మునిగపోయాయి.దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియలో దర్శనమిస్తున్నాయి.

దటీజ్ భూమన కరుణాకర్ రెడ్డి, భారీ వరదల్లో, మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే, వీడియో సోషల్ మీడియాలో వైరల్

తిరుపతి జిల్లా వెంకటగిరి కొండ క్రింద గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరి నుండి ఆల్తూరుపాడు మధ్య గొడ్డేరు చిన్న వాగు రోడ్ పై ప్రవహిస్తుండటం తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెలుగొండ అడవి ప్రాంతం లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు భారీవర్షాలు కురిసిన నేపథ్యం లో గ్రామాలలోని చెరువు నిండుకుండలా మారాయి, కలుజులు పొంగిపొర్లుతున్నాయి పంటపొలాలు, వరినాట్లు పూర్తి గా నీటమునగడం తో రైతులకు నష్టం వాటిల్లింది.

Here's Cyclone Effect Videos

పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని రోడ్లపై ఎక్కడకక్కడ నిలిచిపోయిన వర్షపు నీటిని పెద్ద కాలువల్లోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీరు మొత్తం కూడా మాల్వాడి గుండం మీదుగా కపిలతీర్థంకు చేరుకుంటోంది. దీంతో భక్తులను కపిల పుష్కరిణిలో పుణ్య స్నానాలకు భక్తులను అనుమతించడం లేదు.

మహాబలిపురం సమీపంలో తీరం దాటిన ‘మాండూస్‌’.. నేటి మధ్యాహ్నానికి మరింత బలహీనపడనున్న తుపాను.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. తుపాను ప్రభావంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష .. ఇప్పటివరకూ ఐదుగురి మృతి

తిరుపతి నగరాన్ని మాండూస్ తుఫాను అస్తవ్యస్తం చేసింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కెనడి నగర్, లక్ష్మీపురం సర్కిల్, జై భీమ్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చింది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.నగర పాలక పరిధిలో అన్ని వార్డు సచివాలయంలో పరిధిలో వార్డు కార్యదర్శులు వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Here's Update

కమిషనర్ ఇరువారం వద్ద నీవా నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజల నుంచి సమాచారం అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాండూస్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, వీస్తున్న గాలుల నేపథ్యంలో నగర కమిషనర్ డా. J. అరుణ శనివారం ఉదయం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈదురుగాలులు, జోరు వర్షంలోనే కమిషనర్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు మార్గ నిర్దేశం చేశారు.

తిరుపతి పట్టణంలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని CS ఆదేశించారు.వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని CS డా.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.#CycloneMandous కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం తీరంలో ఒడ్డుకు చేరిన పడవలు, సముద్రం ఉదృతి కొనసాగుతుంది.