IPL Auction 2025 Live

EVM Destroy in Andhra Pradesh: ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది, అందుకే రీపోలింగ్ నిర్వహించలేదు, మాచర్ల ఈవీఎంల ధ్వంసం ఘటనపై మీడియాతో ముఖేశ్‌ కుమార్‌ మీనా

మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం

CEO Mukesh Kumar Meena (Photo-Video Grab)

ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం. డేటా భ‌ద్రంగా ఉండ‌డం వ‌ల్లే రీపోలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని వివ‌రించారు.

పోలింగ్ నాడు మాచ‌ర్ల‌లో ఇలాంటివి 7 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని వెల్ల‌డించారు. అందులో కొంద‌రు ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన‌ట్లు వెబ్‌కాస్టింగ్‌లో గుర్తించామ‌ని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంద‌రిని గుర్తించాల్సి ఉంద‌ని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘ‌ట‌ల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న.. సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు.  మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

20వ తేదీన రెంట‌చింత‌ల ఎస్ఐ కోర్టులో మెమో దాఖ‌లు చేయ‌డంతో పాటు మొద‌టి నిందితుడిగా పిన్నెల్ని రామ‌కృష్ణారెడ్డిని ఎస్ఐ పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ది సెక్ష‌న్ల కింద పిన్నెల్నిపై కేసులు పెట్టిన‌ట్లు సీఈఓ వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న‌కు ఏడేళ్ల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదు అయిన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి.

ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించాం’’ అని సీఈవో స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ సీరియస్ అయింది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.