Depression Makes Landfall: తీరం దాటిన వాయుగుండం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు, రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

పుదుచ్చేరి-చెన్నై మధ్య ఈ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రపదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

Tirupati November 19:  బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. పుదుచ్చేరి-చెన్నై మధ్య ఈ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రపదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో వానలు పడుతున్నాయి. దీంతో తీరప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు.

చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో తిరుమల రెండో కనుమ రహదానికి టీటీడీ మూసివేసింది. రెండో కనుమ దారిలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మొదటి కనుమ దారిలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నది.

భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.  చిత్తూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో వరద బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కల్యాణి జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది.