Devineni Avinash: టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా, ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓటమి
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖను పంపారు. వెంటనే వైసీపీ జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో దేవీనేని అవినాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు.
Amaravathi, November 14: టీడీపీ యువనేత దేవినేని అవినాష్ (Devineni Avinash) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(Devineni Avinash quits TDP) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి(Chandrababu Naidu)కి రాజీనామా లేఖను పంపారు.
వెంటనే వైసీపీ జాయిన్ అయ్యారు. తాడేపల్లి(Tadepalli)లోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan)సమక్షంలో దేవీనేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీలో జాయిన్ అయిన సంధర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాన్నగారి అభిమానుల కోరిక మేరకు వైసీపీలో జాయిన్ అవుతున్నానని తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గౌరవం లేదంటూ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవినాష్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అవినాశ్‌తో పాటు సీనియర్ నేత కడియాల బచ్చిబాబు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.
టీడీపీని వీడిన దేవినేని అవినాష్
పార్టీలో చేరినప్పటి నుంచి అధినాయకుడి మాటే నా బాటగా చాలా నిబద్ధతతో పనిచేశాను. అయితే కృష్ణా జిల్లాలో మా నాయకులు, కార్యకర్తలను వినియోగించుకోవడంలో టీడీపీ విఫలమైంది. కార్యకర్తలకు సముచితస్థానం కల్పించాలని చంద్రబాబును కోరాను. ఎన్నికల్లో నాకు అనువైన స్థానం కాకపోయినా మీ ఆదేశాల మేరకు గుడివాడ నుంచి పోటీ చేశాను.
రాజీనామా లేఖ
ఓటమి బాధ కలిగించినా పార్టీ కోసం ముందడుగు వేశాను. కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం బాధ కలిగించింది. కొందరు స్థానిక నేతలు కావాలని ఇదంతా చేస్తున్నా.అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు నచ్చలేదని రాజీనామా లేఖలో దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ వైసీపీ అభ్యర్థి కొడాని నాని చేతిలో ఓడిపోయారు.
విజయవాడ సీనియర్ రాజకీయ నేతగా దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్ విభజనకు ముందు కాంగ్రెస్‌లో కొనసాగారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఇద్దరూ టీడీపీలో చేరిపోయారు.