IPL Auction 2025 Live

AP Govt. Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.. 2022 జులై 1వ తేదీ నుంచి అమలు

డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

YS jagan (Credits: X)

Vijayawada, Oct 22: ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను (DA) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగుల సంఘం నేతలు కలిసి డీఏ విడుదల చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. అగస్ట్ 2న విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ డీఏ ఇస్తామని ప్రకటించారు.

KTR Comments: రేపో..ఎల్లుండో ఇంట్రస్టింగ్ వార్త వింటారు! మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలుస్తారు, ఈ సారి బీజేపీకి డిపాజిట్లు రావంటూ కామెంట్స్

ఎప్పటి నుంచి అమలు చేయనున్నారంటే?

డీఏను 2022 జులై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. కాగా, దసరాకు రెండు రోజుల ముందు ఇప్పుడు డీఏ విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ