MLC Elections in AP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి, 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ, డిసెంబరు 10న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, కృష్ణా జిల్లాల్లో 2, అనంతపురం జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

EC releases final list of voters in Andhra Pradesh | Photo -PTI

Amaravati, Nov 16: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, కృష్ణా జిల్లాల్లో 2, అనంతపురం జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

నేటి నుంచి నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 26వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. డిసెంబరు 10న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 16న ఓట్లు లెక్కించి, అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది.