Ambati Rambabu Counter to CBN: 2029 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు పోల‌వరం పూర్తి చేసేలా లేడు, టీడీపీ వ‌ల్ల‌నే పోల‌వరం ఆల‌స్య‌మైంద‌న్న అంబ‌టి రాంబాబు

శ్వేతపత్రాల పేరుతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. గతంలో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పోలవరం నిర్మాణం ముందుకు వెళ్ళలేదు. పోలవరం వైసీపీ పూర్తి చేయలేదు అంటున్నారు. అసెంబ్లీలో చెప్పి మీరు ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు.

Ambati Rambabu (Photo-Video Grab)

Vijayawada, June 28: పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై (White Paper on Polavaram) దుమారం రేగింది. జగన్ వల్లే పోలవరం విధ్వంసం అంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిప్పులు చెరిగారు. పోలవరానికి జగన్ శాపంలా మారారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్.. జగన్ వల్లే నష్టపోయింది అని చెప్పే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేశారని ఆయన మండిపడ్డారు. ఐదేళ్ల పాటు పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించలేదన్నారు. కరోనా సమయంలోనూ పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపకుండా చాలా జాగ్రత్తగా చేశామని అంబటి తెలిపారు.

 

”1995 నుంచి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం కాకుండా కేంద్రంలో కూడా చక్రం తిప్పారు. ఆ సమయంలో జీవనాడి పోలవరంపై చంద్రబాబు ఎందుకు దృష్టి పెట్టలేదు. పోలవరం మొదలుపెట్టి అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్ఆర్. సీఎంగా వైఎస్ఆర్.. పోలవరంకి కేంద్రం నుంచి అని అనుమతులు తెచ్చారు. పోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదు. ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన చేయలేదు. జగన్ పై చంద్రబాబు పదే పదే విమర్శలు, వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. జగన్ అంటే చంద్రబాబుకు భయం.

జగన్ మళ్లీ సీఎం అవుతారనే.. శ్వేతపత్రాల పేరుతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. గతంలో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పోలవరం నిర్మాణం ముందుకు వెళ్ళలేదు. పోలవరం వైసీపీ పూర్తి చేయలేదు అంటున్నారు. అసెంబ్లీలో చెప్పి మీరు ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పోలవరం విషయంలో పచ్చి అవాస్తవాలు చెబుతూ జగన్ మీద నింద వేసే ప్రయత్నం చేశారు. టీడీపీ వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైంది. టీడీపీ తప్పిదాల వల్ల పోలవరానికి ఈ పరిస్థితి వచ్చింది. వైసీపీ పాలన ఐదేళ్లలో చాలా చిత్తశుద్ధితో పురోగతి ఉంది. పోలవరం జాతీయ పార్టీ కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్. మీరెందుకు ఆ బాధ్యతలు తీసుకున్నారో ప్రజలకి సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకోమన్నదా? మీరు తీసుకున్నారా? కారణాలు చెప్పాలి” అని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.



సంబంధిత వార్తలు