YS Vijayamma Charitable Trust: వైయస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వైయస్సార్ ఫ్యామిలీది కాదు, క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్ యాజమాన్యం, వైయస్ విజయమ్మ నడుపుతున్నదంటూ సోషల్ మీడియాలో పుకార్లు

వైయస్సార్ ఫ్యామిలీకి చెందిన వైఎస్‌ విజయమ్మ చారిటబుల్‌ ట్రస్టు(YS Vijayamma Charitable Trust)ను కేంద్రం బ్యాన్ చేసిందని..అయితే ఇందులో నిజమెంతో తెలియకుండానే సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఏపీ (Andhra pradesh) ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అంటూ వార్తలు వడ్డించారు.

Fact Check: Did Centre ban YS Vijayamma Charitable Trust? (Photo-Twitter)

Amaravathi, November 20: ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. వైయస్సార్ ఫ్యామిలీకి చెందిన వైఎస్‌ విజయమ్మ చారిటబుల్‌ ట్రస్టు(YS Vijayamma Charitable Trust)ను కేంద్రం బ్యాన్ చేసిందని..అయితే ఇందులో నిజమెంతో తెలియకుండానే సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఏపీ (Andhra pradesh) ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అంటూ వార్తలు వడ్డించారు.

అయితే ఇది ఫేక్ అని దీనికి వైయస్సార్ ఫ్యామిలీ(YSR Family)కి సంబంధం లేదని ట్రస్ట్ యాజమాన్యం తెలిపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ( YS Rajasekhar reddy) కుటుంబంపై ఉన్న అభిమానంతోనే వైఎస్‌ విజయమ్మ(ys vijayamma) చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేశానని తణుకు(Tanuku) పట్టణానికి చెందిన అంబడిపూడి వీరభద్రావతి తెలిపారు.

2012లో విజయమ్మ పేరుతో ట్రస్టు ప్రారంభించినప్పటి నుంచి తాను ట్రస్టీగా వ్యవహరిస్తున్నానని ఆమె చెప్పారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది 2018 జనవరిలో ట్రస్టు కార్యకలాపాల( Charitable activities)ను నిలిపేశానన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో కుట్టుమిషన్‌ నేర్పించడంతోపాటు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, దుస్తులు తదితరాలు పంపిణీ చేశామని చెప్పారు.

బ్యాన్ చేసిన లిస్ట్ 

సొంత ఖర్చులతోనే సేవా కార్యక్రమాలు చేశామని వివరించారు. వైఎస్సార్‌ కుటుంబం నుంచి గానీ, ఇతరత్రా వేరే విధంగా గానీ ఎలాంటి నిధులూ రాలేదని వీరభద్రావతి స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2018 జనవరిలోనే ట్రస్టు మూసివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు.

ఈ సంస్థతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90కి పైగా సంస్థలపైన నిషేధం విధించారు. ఇక ఎన్జీఓ సంస్థ పేరు వైయస్ విజయమ్మ మీద ఉన్నా ఈ సంస్థకు వైయస్ విజయమ్మకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్థ వార్షిక నివేదికలు సమర్పించలేదనే కారణంతో రద్దు చేసారు.

2017-18 వార్షిక రిటర్నులు సమర్పించలేదన్న కారణంతో తమకు నోటీసు వచ్చిందన్నారు. అయితే, విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 ప్రకారం.. నివేదికలను సమర్పించాల్సి ఉన్నా.. 2017-18 సంవత్సరానికి నివేదికలు సమర్పించడంలో నిషేధానికి గురైన సంస్థలు విఫలమయ్యాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

2019, మార్చి 31 వరకు గడువు పొడిగించినా కూడా వార్షిక నివేదికలు సమర్పించలేదని, వార్షిక నివేదికలు సమర్పించకపోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. చివరి సారిగా జూన్ 22న నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లో ఆదాయ వ్యయ నివేదికలు సమర్పించాలని కోరినా...స్పందించకపోవటంతో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్