Kakinada RTC Bus Fire: ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఘటన, ప్రమాదంలో సగం వరకు కాలిపోయిన ఇంద్ర బస్, బస్సులో ఉన్న 15 మంది సేఫ్

జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్‌లో మంటలు (Fire Breaks Out In RTC Bus At Kakinada) రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు.

Fire Breaks Out In RTC Bus At Kakinada in Andhra pradesh (Photo-Video grab)

Kakinada, April 3: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్‌లో (Kakinada RTC Bus Fire) అనూహ్యంగా మంటలు చెలరేగాయి. జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్‌లో మంటలు (Fire Breaks Out In RTC Bus At Kakinada) రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు.

దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటల కారణంగా బస్సులో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో బస్సు సగం వరకు కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు తరలించారు.

Here's Fire Video

ప్రయాణ సమయంలో బస్సులో 15 మంది ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.



సంబంధిత వార్తలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు