Car Accident in Tirumala: తిరుమల కొండపై కారు దగ్ధం.. యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala, Dec 8: దేవదేవుడు ఆ వేంకటేశుడు కొలువైన తిరుమలలోని (Tirumala) ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand) వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన భరత్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం నిన్న కారులో తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరులో బయలుదేరిన వారు .. రాత్రి 9.05 గంటలకు తిరుమల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే .. బస్టాండుకు వచ్చీరాగానే ఆ సమయంలో ఉన్నట్టుండి కారులో నుంచి పొగలు వచ్చాయి.
Here's Video:
అప్రమత్తతతో తప్పిన ముప్పు
కారులో నుంచి పొగలు రావడం గమనించిన భరత్.. వెంటనే అప్రమత్తమయ్యాడు. కారులో నుంచి కుటుంబ సభ్యులందరినీ వెంటనే కిందకు దింపేశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో కారులో నుంచి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటల్లో కారు ముందు భాగం పూర్తిగా దగ్దమైంది.