Chandrababu Naidu: అబ్దుల్ కలాం నా దగ్గరే విజన్ నేర్చుకున్నారు, విజన్-2020 పత్రాలతోనే దేశ ఆర్థిక విజన్‌పై పుస్తకాన్ని విడుదల చేశారు, చిత్తూరు మీటింగ్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ రాష్ట్రపతి, అపర మేధావి దివంగత అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లానన్నారు.

former-president-abdul-kalam-learnt-the-vision-from-me-says-chandrababu-naidu (Photo-former-president-abdul-kalam-learnt-the-vision-from-me-says-chandrababu-naidu (Photo-Instgram)

Chandragiri, Novemebr 9: చిత్తురూ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి దివంగత అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లానన్నారు. ఈ విజన్‌ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆ విజన్‌కు సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్‌పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారని చెప్పారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి (Chandragiri) సమీపంలోని మామండూరు వద్ద మూడు రోజుల జిల్లాస్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు (Agrigold Victims) తెలుగుదేశం ప్రభుత్వం (TDP) పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని, అయితే ఎన్నికల కోడ్‌ వల్ల అది ఆగిపోయిందన్నారు. అయితే ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) ప్రభుత్వం ఆ నగదును బాధితులకు చెల్లించిందని చెప్పారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం రెండంకెల అభివృద్ధిని సాధించిందని చెప్పారు. రాష్ట్రాన్ని నంబర్‌–1గా తీర్చిదిద్దాలని ఎంతో ప్రయత్నించానని, అయితే ఆ అదృష్టం తనకు లేదని తెలిపారు.