Fraudulent Gang Arrested: ఇలా ఎవరూ మోసపోకండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ. 20 కోట్లు కొట్టేసిన దొంగల ముఠా, చిత్తూరు పోలీసులకు చిక్కిన ముఠా నాయకుడు, మీడియాకు వివరాలను వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను దాదాపు రూ. 20 కోట్ల వరకు మోసం చేసిన ముఠాను (Fraudulent Gang Arrested) చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినట్లు నకిలీ ఆర్డర్‌ కాపీలు (fake govt job promise)

Representational Image (Photo Credits: Pixabay)

Chittoor, Mar 4: కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను దాదాపు రూ. 20 కోట్ల వరకు మోసం చేసిన ముఠాను (Fraudulent Gang Arrested) చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినట్లు నకిలీ ఆర్డర్‌ కాపీలు (fake govt job promise)

చేతిలో పెట్టి.. కోల్‌కతా తీసుకెళ్లి ఫేక్‌ శిక్షణ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేసినట్లుగా వీరిపై కేసు నమోదు అయింది. దాదాపు రూ. 20 కోట్ల వరకు ఈ ఈ దందా ద్వారా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా చేతిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు నిరుద్యోగులు (Unemployees) చిక్కుకున్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు (Chittoor Police) తెలిపారు..

చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ,సీఐలు నరసింహరాజు, యుగంధర్, ఎస్‌ఐ విక్రమ్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన దేవప్రియన్‌ చెన్నై ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకుని ఎయిర్‌పోర్టులో ఉద్యోగం మానేశాడు. ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రి పేషీలో మరికొందరితో పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత ఇలాంటి మోసాలకు తెర లేపాడు.

ఆ మహిళ నాలుగు గంటల పాటు నాపై అత్యాచారం చేసింది, గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన మరో మహిళ, రేప్ గా పరిగణించలేక ’లైంగిక వేధింపుల‘ కేసుగా నమోదు చేసిన పోలీసులు

పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చెన్నైలకు చెందిన పలువురిని తన ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. రైల్వే, ఐటీ తదితర శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేశాడు. ఫేక్‌ ఆర్డర్‌ కాపీలు వారి చేతిలో పెట్టి నిజంగానే ఉద్యోగాలు వచ్చినట్లు భ్రమ కల్పించాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోయిన కొందరు ఎదురు తిరిగితే వారి డబ్బు వెనక్కి ఇచ్చేవాడు. వసూలు చేసిన డబ్బుతో పాండిచ్చేరి, చెన్నై ప్రాంతాల్లో విలాసవంతమైన విల్లాలు, పంట పొలాలు కొనుగోలు చేశాడు. కాగా ఇతని మోసం బారీన డిన వారిలో చెన్నైకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు గుర్తించారు.

నాతోనే ఉండు..పెళ్లి చేసుకోకు, యువతి అంగీకరించకపోవడంతో కత్తితో దాడి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పరిస్థితి విషమం, పోలీసులు అదుపులో నిందితుడు

కాగా చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురానికి చెందిన ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మి దేవప్రియన్‌కు 20 రోజుల క్రితం రూ. 26 లక్షలు ముట్టచెప్పాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో అతని కదలికలపై అనుమానం వచ్చి తన నగదు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశాడు. అతను చెల్లని చెక్కు ఇవ్వడంతో బాధితుడు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. ముఠా నాయకుడు 27 ఏళ్ల దేవప్రియన్, సభ్యుడు 50 ఏళ్ల హరిహరకుమార్‌ను చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాగా, ఈ లింకులో దొరకాల్సిన కేటుగాళ్లు చాలామంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

India's Suicide Death Rate: భారత్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Share Now