Gautam Sawang Resign: ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా, పదవీ విరమణకు రెండేళ్ల ముందే నిర్ణయం, గ్రూప్ 2 మెయిన్స్ కూడా వాయిదా
తన రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు (Abdul Nazeer) అందజేయగా ఆయన ఆమోదించారు. వైసీపీ ప్రభుత్వంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ (APPSC Chairman) అయ్యారు.
Vijayawada, July 04: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు (Abdul Nazeer) అందజేయగా ఆయన ఆమోదించారు. వైసీపీ ప్రభుత్వంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ (APPSC Chairman) అయ్యారు. పదవీ విరమణకు రెండేళ్ల ముందే సవాంగ్ రాజీనామా చేశారు.
అటు.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో పరీక్షను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ(APPSC) వెల్లడించింది. సవరించిన పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఏప్రిల్ లో గ్రూప్- 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా.. మెయిన్స్ కు 92వేల మందికి పైగా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.