GIS 2023: విశాఖకు చేరుకున్న సీఎం జగన్, రెండు రోజుల పాటు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, సమ్మిట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం

రేపు, ఎల్లుండి(శుక్ర, శనివారాల్లో) జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(గురువారం) సీఎం జగన్‌ (AP CM YS Jagan) తాడేపల్లి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్లారు.

AP CM YS Jagan| ( File Photo)

Vizag, Mar 2: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం (YS Jagan's Visakhapatnam tour) చేరుకున్నారు. రేపు, ఎల్లుండి(శుక్ర, శనివారాల్లో) జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(గురువారం) సీఎం జగన్‌ (AP CM YS Jagan) తాడేపల్లి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుండి రాడిసన్ బ్లూ హోటల్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. రాత్రికి నగరంలో బస చేస్తారు.

3వ తేదీ షెడ్యూల్‌: ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో (AP Global Investors Summit 2023) సీఎం పాల్గొంటారు. రాత్రి 8.00-9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు.

4వ తేదీ షెడ్యూల్‌: ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌, విజయవంతం కావాలని ఆకాంక్షించిన తెలంగాణ మంత్రి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి.

Here's AP CMO Tweet

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‍కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్‌లు తరలిరానున్నారు.

హిందూ మత వ్యాప్తి కోసం జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, 26 జిల్లాల్లో 3000 హిందూ దేవాలయాల నిర్మాణం, హిందూ మతాన్ని విశ్వ వ్యాప్తం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం

రెండు రోజుల సమ్మిట్ కోసం‌ఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధం‌చేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు.

ఏపీలో కొత్తగా మరో ఆరు మండలాలు, ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్, నెలలోగా అభ్యంతరాలను తెలపాలని సూచన

కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన‌ సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్‌కు తీసుకుంటున్నారు.

మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం‌ కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు.

విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ‌ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్‌కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు‌ కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి.

వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్‌కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది.



సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు