TN Police Money Seized Issue: ఆ రూ.5 కోట్లు మావే, వైసీపీ నేతకు ఎలాంటి సంబంధం లేదు, బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు వివరణ

5 కోట్ల 22 లక్షలు (TN Money Smuggling Issue) తనవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు (Gold Businessman Nallamalli Balu) ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఏ రాజకీయపార్టీకి, నాయకులకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి నగదు విడిపించుకుంటామని బాలు చెప్పారు.

Gold Businessman Nallamalli Balu Gives Clarity About TN Money seized Issue (Photo-Video Grab)

Amaravti, July 16: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఫార్చ్యునర్ వాహనంలో దొరికిన రూ. 5 కోట్ల 22 లక్షలు (TN Money Smuggling Issue) తనవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు (Gold Businessman Nallamalli Balu) ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఏ రాజకీయపార్టీకి, నాయకులకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి నగదు విడిపించుకుంటామని బాలు చెప్పారు. ఆ డబ్బు నాదైతే ఎంక్వయిరీ వేయించండి, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ రంగు పులుముకున్న రూ. ఐదు కోట్ల వ్యవహారం

ఈ వ్యవహారాన్ని ఒక రాజకీయపార్టీకి చెందిన నేతలతో ముడిపెట్టి మాట్లాడుతున్నారని... అందులో నిజం లేదని బాలు అన్నారు. ఏ పార్టీకి, ఏ నాయకుడికి దీంతో సంబంధం లేదని చెప్పారు.

మరోవైపు తమిళనాడు పోలీసులకు చిక్కిన నగదుకి తనకు ఎలాంటి సంబంధం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు. కారుపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం విపక్షాలకు మరింత బలాన్ని ఇచ్చింది. అధికార పార్టీపై విపక్ష నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు.ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే మంత్రి బాలినేని ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వైసీపీ ఫిర్యాదు చేసింది.

రూ. 5 కోట్ల నగదుతో వెళ్తున్న ఓ వాహనాన్ని చెన్నై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆ వాహనం వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులదంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. టీడీపీ ఆరోపణలపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి (YSRCP MLA Balineni Srinivasa Reddy) స్పందించారు.

చెన్నై పోలీసులకు చిక్కిన ఆ ఐదు కోట్ల రూపాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కుట్రపూరితంగానే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కారు దొరికిన సమయంలో తాను మంత్రిమండలి సమావేశంలో ఉన్నానని, ఆ విషయం తనకు సమావేశం అయిపోయే వరకూ తెలీదని మంత్రి బాలినేని అన్నారు. పోలీసులకు దొరికిన డబ్బు తనదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని సవాలు విసిరారు.

తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేత బొండా ఉమా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘లోకేష్ కూడా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా జీవితంలో ప్రజలు తిరస్కరించారు. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచావా లోకేష్? నా గురించి, నా రాజకీయ జీవితం గురించి మీ టీడీపీ నాయకులే చెప్తారు నేను మచ్చలేని వ్యక్తిని. ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలి. కారుపై ఉన్న జీరాక్స్‌ స్టిక్కర్‌ గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశాం.’ అని పేర్కొన్నారు.