Anusha Murder Case Update: అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం, దిశా, పలు చట్టాల కింద కేసులు నమోదు, కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ విశాల్‌ గున్ని

గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్య కేసు వివరాలను ఎస్పీ విశాల్‌ గున్ని (SP Vishal Gunny) వెల్లడించారు. పోలీసులు నిందితుడు విష్ణువర్ధన్‌పై దిశా, పలు చట్టాల కింద కేసులను నమోదు చేశారు.

SP Vishal Gunny (Photo-Twitter)

Guntur, Feb 27: ఏపీలోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని కోట అనూష హత్య కేసులో (Anusha Murder Case Updates) నిందితుడు విష్ణువర్థన్‌రెడ్డిని గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్య కేసు వివరాలను ఎస్పీ విశాల్‌ గున్ని (SP Vishal Gunny) వెల్లడించారు. పోలీసులు నిందితుడు విష్ణువర్ధన్‌పై దిశా, పలు చట్టాల కింద కేసులను నమోదు చేశారు.

ఈఘటనపై (Guntur Murder Case) పూర్తిస్థాయి విచారణకు ఇప్పటికే నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి నరసరావుపేటలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న అనూషను రెండేళ్ల నుంచి ప్రేమించాలంటూ వేధించేవాడు. ఈ క్రమంలో అనూష అదే కళాశాలలో చదివే మరో యువకుడితో చనువుగా ఉండటాన్ని గమనించి, నమ్మకంగా బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి.. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.

మద్యం తాగించి రెండు రోజులు పాటు యువతిపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో ఒకరు బీజేపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ, మిగతా ముగ్గురు కోసం గాలింపుల చర్యలు చేపట్టిన పోలీసులు

మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడిని అరెస్ట్‌ చేసినట్టు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని వెల్లడించారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కేసు నమోదు చేయడంతో పాటు 48 గంటల్లో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నిందితుడికి త్వరిత గతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో ఈ కేసును మోడల్‌గా పరిగణిస్తామని ఎస్పీ వెల్లడించారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు విష్ణువర్ధన్‌ మృతురాలు అనూషను గత రెండేళ్ళుగా వేధిస్తున్నట్లు తెలిసింది. మొదట విష్ణువర్ధన్‌, అనూషను పాలపాడు కాలువ వద్దకు మాట్లాడుకుందామని తీసుకేళ్ళాడు. ఇద్దర మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఆవేశంతో ఊగిపోయిన నిందితుడు అనూషను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహన్ని కాల్వలోకి పడేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif