Andhra Pradesh: వీడియో ఇదిగో, నువ్వు ఎవరెవరి దగ్గర పడుకున్నావో తెలుసంటూ మంత్రి రోజాపై దారుణంగా కామెంట్లు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు
ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని బండారు సత్యారాయణ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బండారు సత్యరాయణను గుంటూరు తరలిస్తున్న పోలీసులు.
Vjy, Oct 2: మాజీ మంత్రి బండారు సత్యారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని బండారు సత్యారాయణ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బండారు సత్యరాయణను గుంటూరు తరలిస్తున్న పోలీసులు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆయనను మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ హై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన బండారు సత్యనారాయణ.మంత్రి రోజాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
బండారు మాట్లాడుతూ..రోజా నీ బ్లూ ఫిల్ములు మా దగ్గర ఉన్నాయి..మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరెవరి దగ్గర పడుకున్నావో, ఎన్ని లాడ్జిలు తిరిగావో మాకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Here's News
ఆ క్రమంలోనే పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు భారీగా బండారు ఇంటికి తరలివచ్చారు.
టీటీడీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్ర్యంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు.