Half Day Schools In AP: ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్! ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు, వడగాల్పులు, ఎండల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్‌కుమార్ (Suresh Kumar) తెలిపారు.
Vijayawada, June 18: ఏపీ విద్యార్థులకు శుభవార్త (Half Day Schools) ! ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ (Ap Schools) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్‌కుమార్ (Suresh Kumar) తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. ఉదయం 7: 30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సూచించారు.
ఉదయం 8:30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావ పంపిణీ, ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.