IPL Auction 2025 Live

HC on Bigg Boss Show: బిగ్‌బాస్‌ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, టీవీల్లో అసభ్యకర రీతిలో వచ్చే రియాల్టీ షోలకు సెన్సార్‌ లేకపోతే ఎలా అని మండిపాటు

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీల్లో అసభ్య, అభ్యత­రకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేయక­పోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.

AP High Court and Bigg Boss Show (photo-File Image)

బిగ్‌బాస్‌ షో నిలిపివేసేలా ఆదే­శాలు జారీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీల్లో అసభ్య, అభ్యత­రకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేయక­పోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవ­హారంపై లోతుగా విచారణ జరుపు­తామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.

యువ­తను పెడ­దో­వ పట్టిస్తున్న బిగ్‌బాస్‌ షో నిలిపివేసేలా ఆదే­శాలు జారీ చేయాలని కోరుత సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దా­ఖలు చేసిన పిల్‌­పై జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసా­దరావు, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖ­లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా­లను, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్, స్టార్‌ టీవీ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎండేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, బిగ్‌బాస్‌ షో వ్యాఖ్యా­త అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.

మరింత కిక్కెక్కించనున్న బిగ్‌ బాస్‌ సీజన్ 7, సరికొత్త సవాళ్లు అంటూ హింట్ ఇచ్చిన కింగ్ నాగార్జున, బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి ముందు సరికొత్త ప్రోగ్రాం

స్టార్‌ మా టీవీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌­రెడ్డి, బిగ్‌బాస్‌ షోను అభివృద్ధి చేసిన ఎండేమోల్‌ ఇండియా లిమిటెడ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది చిత్తరవు రఘు, పిటిషనర్‌ తరఫున గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Red Stream on Hyderabad Roads: హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు