Heart Attack Kills MBBS Student: వణికిస్తున్న హార్ట్ ఎటాక్ మరణాలు, తాజాగా గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి, జార్జియాలో ఏపీ MBBS విద్యార్థి మృతి
జార్జియాలోని టిబిలిసిలో మెడిసిన్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రావూరి గిరీష్ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.
రాయచోటి, సెప్టెంబర్ 4: జార్జియాలోని టిబిలిసిలో మెడిసిన్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రావూరి గిరీష్ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. రాయచోటిలోని పూజారి బండలో నివాసం ఉంటున్న గిరీష్ తండ్రి రావూరి శ్రీనివాస్ టిబిలిసిలోని యూరోపియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమారుడు మృతి చెందాడని జిల్లా యంత్రాంగానికి తెలియజేసినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా వార్తను ధృవీకరించారు. తమ కుమారుడి మృతదేహాన్ని వెలికితీసేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబీకులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు.
కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లారీని ఢీకొన్న ఘటనలో పలువురు మృతి
మరో ఘటనలో గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బళ్లారి అర్బన్ లో చోటు చేసుకుంది. బళ్లారి తాలూకా మోకా సమీపంలో గల బైరదేవనహళ్లి గ్రామానికి చెందిన రుక్మణ్‌రెడ్డి రెండో కుమారుడు ప్రతాప్ రెడ్డి (20) మైసూరులోని ఎన్‌ఐఈ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ప్రతాప్ రెడ్డి ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు.
గతంలో శనివారం నాడు యూపీలోని లఖింపూర్ ఖేరీలోని ఫన్ మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లిన 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. థియేటర్ లాబీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా మొత్తం ఎపిసోడ్ రికార్డయింది.