Honour Killing In Nandyala: కుమార్తె అత్తింటికి వెళ్ళట్లేదని కన్నతండ్రి ఘాతుకం.. బిడ్డను హత్య చేసి తల, మొండెం వేర్వేరు.. నంద్యాలలో ‘పరువు’ హత్య

అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను చంపి ముక్కలు చేశాడు.

Image used for representational purpose (Photo Credits: Pixabay)

Nandyala, Feb 25: కుమార్తె అత్తింటికి వెళ్ళట్లేదని, దీంతో ఇరుగు పొరుగు వారి ముందు తన పరువు పోతుందని ఓ తండ్రి క్రూరమైన ఆలోచన చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను చంపి ముక్కలు చేశాడు. ఏపీలోని నంద్యాల (Nandyala) జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరులో జరిగిన ఈ పరువు హత్య (Honour killing) కలకలం సృష్టిస్తున్నది. గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డి కుమార్తె ప్రసన్న (21)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లికి ముందు ప్రసన్న మరో యువకుడిని ప్రేమించేది.

పెళ్లి రోజు మర్చిపోయాడని భర్తను రక్తమొచ్చేలా కొట్టిన భార్య, అడ్డువచ్చిన అతని తల్లిపై కూడా దాడి, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

పెళ్లయ్యాక కూడా అతడిని మర్చిపోలేకపోయింది. ఈ క్రమంలో ఇటీవల గ్రామానికి వచ్చిన ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. అత్తింటికి వెళ్ళకుండా పుట్టింట్లోనే ఉంటున్న కుమార్తె ప్రవర్తనతో తన పరువు పోయిందని ఆగ్రహంతో ఊగిపోయిన దేవేంద్రరెడ్డి ఈ నెల 10న కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మరికొందరి సాయంతో కుమార్తె మృతదేహం నుంచి తలను వేరు చేసి రెండింటిని వేర్వేరు చోట్ల పడేశారు. తరచూ ఫోన్ చేసి పలకరించే మనవరాలు ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తాత దేవేంద్రరెడ్డిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు, వివాహతేర సంబంధం విచ్ఛిన్నమైన మహిళను సమాజం అంగీకరించదని తెలిపిన ధర్మాసనం