Mumbai, Feb 24: ముంబైలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. భర్త పెళ్లి రోజు మరచిపోయాడని భార్య తన బంధువులతో కలిసి అతన్ని (Wife, her parents bash up man) చితకబాదింది. భర్తతో పాటు అతని తల్లిని కూడా రక్తమొచ్చచేలా కొట్టింది. ఈ ఘటనలో ఘట్‌కోపర్ పోలీసులు మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసింది.
దారుణ ఘటన వివరాల్లోకెళితే.. ముంబైలోని 27 ఏళ్ల ఘట్‌కోపర్ నివాసి విశాల్ నాంగ్రే అనే వ్యక్తి కొరియర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కల్పన ఫుడ్ అవుట్‌లెట్‌లో పనిచేస్తోంది. అతని భార్య కల్పన ఇద్దరూ కలిసి బెగన్‌వాడిలో నివశిస్తున్నారు. ఆ జంటకు 2018లో వివాహమైంది. ఫిబ్రవరి 18 వారి పెళ్లిరోజు. ఆ విషయాన్ని నాంగ్రే (forgetting wedding anniversary) మర్చిపోయాడు. ఈ విషయమై భర్తపై కోపంతో తన తల్లిదండ్రులు, సోదరడుని ఇంటికి పిలిపించి మరి గొడవకు దిగింది.
తన భర్త వివాహ వార్షికోత్సవం గురించి మరచిపోవడంతో కోపోద్రిక్తుడైన మహిళ తన తల్లిదండ్రులు, సోదరుడిని తన ఇంటికి పిలిచిందని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె సోదరుడు, తల్లిదండ్రులు ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత, నలుగురు కలిసి ఆమె భర్త, అతని తల్లిపై దాడి చేసి, అతని వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ దహకే మాట్లాడుతూ, “నలుగురిపై దాడికి కేసు నమోదు చేయబడింది. మేము వారికి నోటీసు ఇచ్చాము. ఈ విషయం గురించి విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాత్రి 9:30 గంటల సమయంలో వాగ్వాదం సందర్భంగా, కల్పన తన అత్తగారిని చెంపదెబ్బ కొట్టింది, దీని ఫలితంగా గొడవ మరింత తీవ్రమైంది.నాంగ్రే, అతని తల్లిని రాజవాడి ఆసుపత్రిని తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించిన తర్వా..ఘట్కోపర్ పోలీసులను ఆశ్రయించారు. తన భార్య సోదరుడు, తల్లిదండ్రులు తనపై దాడి చేశారని నంగ్రే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య సోదరుడు తన చేతులు, ముఖంపై కూడా కొరికాడని ఫిర్యాదులో బాధితుడు తెలిపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అతని ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు అతని భార్య, సోదరుడు, ఆమె తల్లిదండ్రులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 323, 324, 327, 504, 506, 34 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.