Rain Alert in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం, 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం, 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు, వెల్లడించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు
గత నెలలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (Andhra Pradesh) అతలాకుతలం చేసిన నేపథ్యంలో మళ్లీ వర్షాల రూపంలో (Rain Alert in AP) మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, దాని అనుసంధానంగా ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (IMD) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.
Amaravati,Nov 23: ఏపీని మళ్లీ వర్షాలు వణికించనున్నాయి. గత నెలలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (Andhra Pradesh) అతలాకుతలం చేసిన నేపథ్యంలో మళ్లీ వర్షాల రూపంలో (Rain Alert in AP) మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, దాని అనుసంధానంగా ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (IMD) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.
దాని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొన్నారు.మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.
సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కె. కన్నబాబు తెలిపారు.