Humanity My Religion: మానవత్వమే నా మతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ నా మేనిఫెస్టో, మాట నిలబెట్టుకోవడమే నా కులం, నేను ఉన్నాను..నేను విన్నాను, కులం గురించి మాట్లాడేవారికి కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra CM Jaganmohan Reddy) కులం వేదికగా ఈ రాజకీయలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న మతం, కులం ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మతం మానవత్వం(Humanity My Religion).. కులం మాట నిలుపుకునే కులం(Commitment is Caste) అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Amaravathi, December 3: గత కొంత కాలం నుంచి ఏపీ(Andhra pradesh)లో కులం మీద రాజీకీయాలు నడుస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra CM Jaganmohan Reddy) కులం వేదికగా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న మతం, కులం ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మతం మానవత్వం(Humanity My Religion).. కులం మాట నిలుపుకునే కులం(Commitment is Caste) అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
గుంటూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా (YSR Arogyasri Asara) పథకాన్ని ప్రారంభించిన జగన్ అనంతరం మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తన మతం, కులంపై వస్తోన్న ఆరోపణలు చూసి బాధేస్తోందన్న జగన్.. ‘‘నా మతం మానవత్వం.. నా కులం మాట నిలుపుకునే కులం’’ అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు పాదయాత్ర సందర‍్భంగా ఓ హామీ ఇచ్చాను. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ ఆర్నెల్లు పని చేశాం. అందులో భాగంగా ఇచ్చిన మాటలో ఒకదాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చాను. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాను. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం.
CMO Andhra Pradesh Tweet
మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడారు. దానికి నాకు చాలా బాధ అనిపించింది. నా మతం మానవత్వం. ఈ వేదికగా చెబుతున్నా... నా కులం మాట నిలబెట్టుకునే కులం. నేను ఉన్నాను... నేను విన్నాను అనే మాటను నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. ఏపీ పోలీసు శాఖ సంచలన నిర్ణయం
ఇక వాళ్లు చేస్తున్న అవాకులు, చెవాకులు పక్కనపెడితే..ఇవాళ జరుగుతున్న ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికాం. ఇందుకు నాకు సంతోషంతో పాటు గౌరవంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
గుంటూరులో ఏపీ సీఎం
గుంటూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో అనారోగ్యం కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకూడదన్నది తన అభిమతమని జగన్ అన్నారు. ఆరోగ్య విభాగంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను మే నాటిని భర్తీ చేస్తామని.. జనవరి నుంచి కేన్సర్ రోగులకు సంబంధించి అన్ని రకాల చికిత్సకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని వెల్లడించారు.
జనవరి 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయనున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా 2వేల రోగాలకు చికిత్స తీసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా శస్త్రచికిత్స చేసుకున్న వారికి నెలకు రూ. 5వేల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తామని.. డిసెంబర్ 15 నాటికి 510 రకాల మందులను అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.