IAS Officers Transfer in AP: ఏపీలో 8 మంది ఐఎఎస్ అధికారులు బదిలీ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ ( IAS Officers transfers in Andhra Pradesh ) అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీఅయ్యాయి.

TTD EO Dr. KS Jawahar Reddy (Photo-Video Grab)

Amaravati, Feb 22: అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ (IAS Officers Transfers in AP) చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ ( IAS Officers transfers in Andhra Pradesh ) అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీఅయ్యాయి. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. ఆయన సీఎంవోలో నియమితులైనప్పటికీ, టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.

ఇక, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ బదిలీ అయ్యారు. రవాణా శాఖ కమిషనర్ గా ఎంటీ కృష్ణబాబు, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు, ఎక్సైజు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఏపీలో కరోనా వేవ్ ముగిసినట్లే, కొత్తగా 244 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47 కేసులు నమోదు

ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఎండీ బాబు ఏకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీఎస్సీ నుంచి, రవాణాశాఖ కమిషనర్ పోస్టుల నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖల నుంచి నీరబ్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఐఏఎస్ అధికారులతో పాటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజ‌నేయులు నియ‌మితుల‌య్యారు. ఇక ఏసీబీ డీజీగా మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి రాజేంద్ర‌నాథ్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. ఇంకో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి భ‌ర‌త్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.