Andhra Pradesh Shocker: అక్రమ సంబంధం వద్దన్న మామ, కావాలన్న కోడలు, ఆగ్రహంతో కోడలిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మామ, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు, తూర్పుగోదావరిజిల్లా మకిలిపురం మండలంలో ఘటన

వివాహేతర సంబంధం వద్దని చెప్పినా వినకపోవడంతో కోడలిని మామ దారుణంగా హత్య (Man Murders daughter in Law) చేశాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Malikipuram, July 31: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మకిలిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం వద్దని చెప్పినా వినకపోవడంతో కోడలిని మామ దారుణంగా హత్య (Man Murders daughter in Law) చేశాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణకు ప్రియమణి (25) స్వయానా సోదరి కూతురు.

సోదరి కుటుంబం అండమాన్‌లో నివాసం ఉంటోంది. సత్యనారాయణ కుమారుడు విజయ్‌కుమార్‌ కూడా ఉపాధి కోసం అండమాన్‌ వెళ్లాడు. కుమారుడు ప్రియమణిని ఏడేళ్ల క్రితం అక్కడే వివాహం చేసుకుని స్వగ్రామానికి తీసుకు వచ్చాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేసి విజయ్‌కుమార్‌ ఉపాధి రీత్యా గల్ఫ్‌లో ఉంటున్నాడు. వారికి ఒక కొడుకు. ఈ నేపథ్యంలో కోడలు అడ్డదారులు (Illegal affair) తొక్కుతోందని మామ అనుమానించాడు.

ఉలిగమ్మ ఉత్సవంలో హిజ్రాల మధ్య గొడవ, పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు, అనంతపురంలో ఘటన

తన తీరును మార్చుకోవాలని పదే పదే హెచ్చరించాడు. అయిన కోడలు వినకపోవడంతో ఆగ్రహించిన మామ కోడలు ప్రియమణిని సత్యనారాయణ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన కోడలిని తానే తానే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్

PAC Elections: వైసీపీ సంచలన నిర్ణయం, పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Gautam Adani Bribery Case: లంచం ఆరోపణలను ఖండించిన వైసీపీ, అదాని గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటన, సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని వెల్లడి