Illegal Registration Case: జేసీ ఫ్యామిలీకి షాక్, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అనంతపురం కోర్టు, మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ

ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లను (JC Prabhakar Reddy, Asmith Reddy) రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు (PT warrants) జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు విచారించారు.

coronavirus-test-to-TDP leader jc-prabhakar-reddy-and-his-son-asmith-reddy (Photo-Twitter)

Amaravati, June 18: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యుమెంట్ల అక్రమాల కేసులో (Illegal Registration Case) అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ల బెయిల్‌ పిటిషన్‌ను గురువారం అనంతపురం కోర్టు (Anantapur Court) తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లను (JC Prabhakar Reddy, Asmith Reddy) రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు (PT warrants) జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు విచారించారు. టీడీపీకి మళ్లీ షాక్, పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్, బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించారని ఆరోపణలు

ఇద్దరూ జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయి కడప జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌తో ఎన్‌ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్‌ రెడ్డిలకు మెజిస్ట్రేట్‌ 14 రోజుల పాటు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని వన్‌టౌన్‌ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. గత సోమవారం జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిల బెయిల్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలైంది. నేడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.  జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు, ఇద్దర్నీ కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన అధికారులు, ఫోర్జరీ సంతకాలతో స్కామ్ చేశారని ఆరోపణలు

అశోక్ లే లాండ్ నుంచి తుక్కు కింద బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేసి తప్పుడు ఇన్‌వాయిస్‌లతో ఆ వాహనాలను నాగాలాండ్‌‌లోని కొహిమా,ఏపీలోని అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో బీఎస్‌ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారన్న ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అలాగే 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లు సమర్పించినట్టు విచారణలో తేలింది.

ఫోర్జరీ కేసులో గత శనివారం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల్ని హైదరాబాద్‌లో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారిని అనంతపురం తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. మొదట అనంతపురం జైలుకు తరలించాలని భావించినప్పటికీ.. అక్కడ కరోనా భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు తరలించారు.