Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)

కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Leopard found at Tirumala (Credits: X)

Tirumala, Sep 29: కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు (Leopards) భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం సృష్టించింది.శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు ఓ చిరుత వచ్చింది. చిరుతను గమనించిన కుక్కలు దాన్ని వెంబడించాయి. దీంతో భయాందోళనకు గురైన సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. సీసీటీవీ దృశ్యాలను బట్టి చిరుతను పట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రిపోర్టర్‌ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)

Here's Video:

అప్పటి ఘటనతో..

గత ఏడాది మెట్ల మార్గంలో ఓ బాలికపై చిరుత దాడి చేసి చంపి తినడం తెలిసిందే. ఆ ఘటనతో మెట్ల మార్గంలో టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఆంక్షలను విధించారు. ఇప్పటికే కొన్ని చిరుతలను పట్టుకుని జూలో వదిలేశారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు.. 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు