New Liquor Policy in AP: ఏపీలో ఇక రూ.99ల క్వార్టర్ బాటిల్ వచ్చేసింది, ఈ నెలలో కోటి ఇరవై లక్షల సీసాలు రెడి అవుతున్నట్లు వెల్లడించిన ఎక్సైజ్ అధికారి నిశాంత్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు.

Liquor bottles at Rs 99 available in Andhra Pradesh shops, says excise director Nishant Kumar

Vjy, Oct 18: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రైవేటు మద్యం షాపుల్లో వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన రూ.99ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అందుబాటులో లేకపోవడంతో షాపుల నిర్వాహకులతో మందుబాబులు గొడవ పడుతున్నారు. తక్కువ ధర మద్యం ఎప్పుడు వస్తుందంటూ నిలదీస్తున్నారు.

వీడియో ఇదిగో, క్వార్టర్ రూ.99 అని చెప్పి 180 రూపాయలకి అమ్ముతారా, వైన్స్ షాపుకి వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్న సీపీఐ నారాయణ

దీంతో రాష్ట్ర ఎక్సైజ్ అధికారి మందు బాబులకు గుడ్ న్యూస్ అందిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన ఐదు సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయని తెలిపారు. గురువారం నాటికి పది వేల కేసుల రూ.99 మద్యం మార్కెట్ కు చేరిందని, సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని ఆయన వివరించారు.

వీడియో ఇదిగో, చిత్తూరు జిల్లాలో ఆంజేనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

దశల వారీగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ క్రమంలో మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మధ్యం ఈ నెలలో అందుబాటులోకి రానుందని తెలిపారు. వినియోగాన్ని అనుసరించి తదుపరి నెలలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని నిశాంత్ కుమార్ వివరించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు