AP Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు

Rains (Photo-Twitter)

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.  ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని, ఆపై నవంబరు 30 నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది.

అక్కడ్నించి వాయవ్య దిశగా పయనిస్తూ డిసెంబరు 2 నాటికి తుపానుగా మారుతుందని వివరించింది. ఈ కారణాల వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక చేసింది.

తెలంగాణలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని చెప్పారు.

ప్రైవేటు వాతావరణ సంస్థల నమూనాల ప్రకారం... ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను డిసెంబరు 4 నాటికి శ్రీహరికోట, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ నమూనా వెల్లడిస్తోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif