Kurnool Shocker: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని..భార్యను చంపి తాను ఊరేసుకున్న మద్యం బానిస, కర్నూలు జిల్లా హొళగుందలో దారుణ ఘటన, హత్య, ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హొళగుండ పోలీసులు
తాగుడుకు బానిసైన వ్యక్తి (man addicted to alcohol) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపి, తాను ఆత్మహత్య (committed suicide) చేసుకున్నాడు.
Kurnool, july 13: కర్నూలు జిల్లా హొళగుందలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన వ్యక్తి (man addicted to alcohol) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపి, తాను ఆత్మహత్య (committed suicide) చేసుకున్నాడు. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఆలూరు సీఐ ఈశ్వరయ్య తెలిపిన కథనం ప్రకారం..హొళగుంద ఎస్సీ కాలనీకి చెందిన మల్లప్ప, శంకరమ్మ పెద్ద కుమారుడు మల్లికార్జున (28)కు కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన ముత్తమ్మ(24)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గణేశ్, వంశీ ఇద్దరు కుమారులు ఉన్నారు.
మల్లికార్జున తన భార్యా పిల్లలతో పాటు తన తల్లి శంకరమ్మ, ఇద్దరు సోదరులు వీరేశ్, రాజశేఖర్ బెంగళూరుకు వలస వెళ్లి కొన్నేళ్లుగా అక్కడే ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలల క్రితం అందరూ సొంత ఊరు హొళగుందకు చేరుకున్నారు. పని చేయకుండా తాగుడుకు బానిసైన మల్లికార్జున తరచూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్య ముత్తమ్మతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఆమెతో గొడవ పడ్డాడు.
భార్య భార్తలు గొడవ...వారుంటున్న ఇల్లు చిన్న పూరి గుడిసె కావడంతో గొడవను చూడ లేక మల్లికార్జున తల్లి, ఇద్దరు సోదరులు పిల్లలను తీసుకుని సమీపంలో వేరే వారి ఇంటికి వెళ్లి నిద్ర పోయారు. ఉదయం వారు ఇంటికి తిరిగి వచ్చి చూడగా గుడిసెకు లోపల తాళం వేసి ఉండడంతో అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి లోపలికెళ్లి చూడగా మల్లికార్జున, ముత్తమ్మ ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. కాగా ముత్తమ్మ నుదటిపై గాయముండి నోటిలో రక్తం కారిన దృశ్యాలు ఉన్నాయి.
విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఆలూరు సీఐ ఈశ్వరయ్య హొళగుంద ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన కుమార్తెను అల్లుడే కొట్టి ( killed his wife for not paying for money to alcohol) చంపి ఉరేశాడని, తర్వాత భయపడి తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతురాలి తండ్రి శివప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హత్య, ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు ఇప్పుడు అనాథలుగా మిగిలారు.