Hyderabad, July 13: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో దమ్మాయిగూడలో ఓ కామాంధుడు చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి (hyderabad Child girl molestation case) పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో రాచకొండ పోలీసుల (Rachakonda police) విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య సంసారానికి పనికిరావంటూ హేళన చేసిందని.. అందుకే మహిళలపై కోపం పెంచుకున్నట్టు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే తన కోరిక తీర్చాలని ఒంటరి మహిళలను నిందితుడు అభిరామ్ వేధించేవాడని తెలిసింది.
లైంగికదాడిని వ్యసనంగా మార్చుకున్న అభిరామ్ చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా,ఈనెల 4న దమ్మాయిగూడకు చెందిన మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి నిందితుడు అభిరామ్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈనెల 9న అదే ప్రాంతంలో మరో చిన్నారిని కిడ్నాప్‌నకు యత్నించాడు. అతడు డ్రగ్స్‌కు సైతం బానిసైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు విచారణలో భాగంగా పోలీసుల అదుపులో ఒడిశాకు చెందిన అభిరామ్ దాస్.. నుదుటిపై తుపాకీ పెట్టి తనను కాల్చేయాలంటూ పోలీసులను వేడుకోవడం గమనార్హం.
జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన నాలుగేళ్ల చిన్నారిని అభి.. ఈ నెల 4న కిడ్నాప్ చేసి మరుసటి రోజు ప్రగతినగర్ నీళ్ల ట్యాంక్ వద్ద విడిచి వెళ్లాడు. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ నెల 9న అదే ప్రాంతంలో మరో చిన్నారిని అపహరించేందుకు యత్నించిన నిందితుడు అభిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా విచారించే క్రమంలో కామాంధుడి వ్యవహారశైలిని చూసి దర్యాప్తు అధికారులు కంగుతిన్నారు.
ప్రస్తుతం కీసర మండలం బండ్లగూడ 60 యార్డ్స్ కాలనీలో ఉంటున్న నిందితుడు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. చీకటి పడితే చాలు కామోన్మాదిగా మారేవాడు. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు డ్రగ్స్‌కు బానిసనయ్యానని.. అయినా మార్పు రాలేదని అభిరాందాస్ అంగీకరించాడు. ఆయన నివాసం చుట్టూ అటవీ ప్రాంతం ఉంటుంది. రాత్రి కాగానే ఒంటరిగా అటవీ మార్గంలో సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ జవహర్‌నగర్ పరిసర ప్రాంతాలకు వచ్చేవాడినని చెప్పాడు. ఈ ప్రాంతంపై పట్టు రావడంతో చిన్నారుల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికే తీసుకొచ్చే వాడినని ఒప్పుకొన్నాడని ఓ అధికారి తెలిపారు.