Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్షసూచన, రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరిక
పలు జిల్లాల్లో వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే తాజాగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా నగరవాసులకు హైదరాబాద్ వాతావారణ శాఖ (Meteorological Department) అలర్ట్ జారీ చేసింది.
Hyderabad, March 23: గడిచిన కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షం (Heavy rains) కురిసిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే తాజాగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా నగరవాసులకు హైదరాబాద్ వాతావారణ శాఖ (Meteorological Department) అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు (Rain alert) ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలోని ఆరు జోన్‌లకు వాతావరణ శాఖ హెచ్చరీకలు జారీ చేసింది.
నగరంలోని ముఖ్యప్రాంతాలైన చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శెరిలింగంపల్లిలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తతతో ఉండాలని అధికారులు సూచించారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. లోటత్తు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.