Antarvedi Temple Chariot Fire: కుట్ర కోణంపై దర్యాప్తు జరుగుతోంది. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, నిరసన కార్యక్రమం చేపడుతున్న బీజేపీ

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై (Antarvedi chariot fire accident) అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని తెలిపారు.

AP Endowment Minister Vellampalli Srinivas (Photo-ANI)

Antarvedi, Sep 10: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో (Antarvedi Temple Chariot Fire) కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ (Vellampalli Srinivas) తెలిపారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై (Antarvedi chariot fire accident) అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ తక్షణమే స్పందించి అలసత్వం వహించిన అధికారులను సస్పెండ్‌ చేశారన్నారు. ఫిబ్రవరిలో స్వామివారి రథోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారని చెప్పారు. దీనికి రూ.95 లక్షలు విడుదల చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వెలంపల్లి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు (Malladi vishnu) మాట్లాడారు.

ఈ సంధర్భంగా చంద్రబాబుపై (Chandrababu Naidu) ఇద్దరూ మండిపడ్డారు. తగలబెట్టడం, కూల్చివేయించడం వంటి నీచ సంస్కృతి చంద్రబాబుదే అని విమర్శించారు. తునిలో రైలు దగ్ధం, రాజధానిలో అరటి తోటలు తగులబెట్టించడం, పుష్కరాల పేరుతో 40 ఆలయాలను కూల్చేయడం బాబు హయాంలోనే జరిగాయని ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేనలు మత రాజకీయాలు చేస్తూ మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. ప్రభుత్వానికి కులాలు, మతాలను అంటగట్టే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

రూ. 90 లక్షలతో కొత్త రథం, అంతర్వేది రధం దగ్ధం ఘటనలో ఈవో సస్పెండ్, నిజాలను నిగ్గు తేల్చేందుకు అంతర్గత విచారణ కమిటీ, టీడీపీకి మాట్లాడే హక్కు లేదని తెలిపిన మంత్రి శ్రీనివాస్

ఇదిలా ఉంటే అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ రథ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేకాధికారిని నియమించింది. కొత్త రథం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసే బాధ్యతలను దేవదాయ శాఖలో అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న రామచంద్ర మోహన్‌కు అప్పగించింది. ఈ మేరకు ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రమాదమా..విద్రోహచర్యా? అంతర్వేదిలో అగ్నికి ఆహుతైన రథం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసనగా నేడు భారతీయ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమం చేపట్టింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటపాటు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జిలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని చెప్పారు. అంతర్వేది పుణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధమైన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుందన్నారు. ఈ ఘటనపై తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ రోజు అంతర్వేది శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. తొలుత 144 సెక్షన్ ఉందని, ఎవరినీ అనుమతించబోమని అధికారులు ఆయన పర్యటనకు నిరాకరించారు. అయితే, భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తల నిరసనలు, నేతల విజ్ఞప్తి తర్వాత ఎట్టకేలకు సంఘటనా స్థలికి పరిమిత సంఖ్యలో చేరుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని రథం కాలిన ప్రాంతానికి బీజేపీ బృందం వెళ్లింది . ఘటనస్థలిలో సోము వీర్రాజు ఆలయ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో మాట్లాడారు.



సంబంధిత వార్తలు