Missing Cases in AP: ఏపీలో వణికిస్తున్న మిస్సింగ్ కేసులు, నెల్లూరులో 5 మంది అదృశ్యం, సత్తెనపల్లిలో బాలుడి కిడ్నాప్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇద్దరు తోడికోడళ్లు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. వెంకటగిరి మండలం జికె పల్లి గ్రామంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఐదుగురూ అదృశ్యమయ్యారు.
Nellore, Nov 17: ఏపీలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురు అదృశ్యమైన ఘటన (Missing Case in Nellore) స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరు తోడికోడళ్లు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. వెంకటగిరి మండలం జికె పల్లి గ్రామంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఐదుగురూ అదృశ్యమయ్యారు.
పిల్లలు ముగ్గురిని (5 members including 2 women 3 children) ఆసుపత్రికి తీసుకెళ్తూ కనిపించకుండా పోయారు. నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి వారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన ఐదుగురి జాడను కనుక్కునేందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు
ఇక సత్తెనపల్లి నిర్మలనగర్‌కు చెందిన వినయ్ (12) అనే బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. రాత్రి 8గంటల సమయంలో వినయ్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు చెబితే వినయ్‌ని చంపేస్తామని.. రూ.10లక్షలు ఇవ్వాలని వినయ్ తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. విజయవాడ రౌడీలమంటూ వినయ్ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. వినయ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వినయ్ కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.