COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,367 కోవిడ్ కేసులు నమోదు, 1,248 మంది రికవరీ, 15 వేలకు కాస్త దిగువకు ఆక్టివ్ కేసులు
ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 70.05 శాతం మందికి కనీసం ఒక్క డోస్ వ్యాకిన్ అందగా, ఇందులో 31.6 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది...
Amaravathi, September 16: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో ఉంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 70.05 శాతం మందికి కనీసం ఒక్క డోస్ వ్యాకిన్ అందగా, ఇందులో 31.6 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,178 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,367 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,34,786కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,31,891గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి 288, చిత్తూరు నుంచి 217 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 14 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 14,044కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,248 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 20,06,034 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,708 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.